covid

 మూడేళ్ళ నాటి శనిని నేటితో శివశివా అంటూ అంతరించి అంతర్ధానమైయిందని 

“ఆశల”పల్లకిలో అదిగో అదిగదిగో 

వచ్చేసింది “శుభకృత్‌”


“వికారి “ అదో భయంకారి 

భూగోళానంత చేసింది “బికారి “ లా

భీభత్స వినాశకారి ఎందరినో చేసింది 

 మృత్యుబారి . 

చెలరేగింది మానవ దేహాల కైంకర్యదారి 


“శార్వరి” వచ్చింది నల్లశార్దూలిలా 

పేరే చీకటి కనిపించని కాళరాత్రిలా 

కాటిలో కళేభరాల గుట్టలు వేసింది 

ప్రముఖులెందరినో కాల్చుకుతింది 

మనిషి కాలం సైతం తన కాలు క్రింద కసి తీరా నలిపి నలిపి వదిలింది 


“ప్లవ” 

అంటే “ప్లవరనుకున్నావా” 

తెలుగు లో “పుష్పా” అన్నా 

అటునుంచీ “తగ్గేదేలేదు” అని

తనవంతుగా ఎంతోకొంత హరించింది

మన భయాల్ని వాడుకుని వాడుకగా 

ప్రతి ఇంటి లో చేరి దాగిదాగి “సహజీవనం” మొదలు పెట్టింది 

“ప్లవ” నామ మహిమో , మానవ విజ్ఞాన శాష్త్ర వికాసమో  కమ్మిన కారుమబ్బులు 

కాలగర్బాన కలిసే రోజు తో 


“ శుభక్రిత్‌” నామ తెలుగు సంవత్సరం కాలూనింది 

గత మృత వేధనలకు “శుభం కార్డు” వేస్తుందని ॥ఆత్యాస॥ పడుతూ ………


అందరికీ శుభం కలగాలి 

మునుపటి మంచిరోజులు రావాలని 

స్వేఛ్ఛ గా “ఆత్మీయ పలకరింపులు “ వీలైతే కౌగిలింతలు”  తో కదలికలు 

కలివిడిగా “కనీసం కరచాలనా” పున్హప్రారంభం కావాలని కోరుకుంటూ .. అప్పుడప్పుడు” మా రాతలు” విసుక్కోకుండా“ఆదరించాలని


మీ 

ముత్యాల

Comments

Popular posts from this blog

శివ సన్యాసి

“కరోనా “ నమస్తే

జలపాతం