స్వర్గానికి దారి .... వయా నరకధ్వారం
👺🧌స్వర్గానికి దారి
వయా నరకధ్వారం 🧌👹.
సడన్ గా ఏదోపెద్ద శబ్దం మాంచి నిద్రలో ఉన్నా, మెలుకువ వచ్చి కళ్ళుతెరిచా ,కోపంగా @ఎవడ్రా అది అని కోపంగా …అరవాలనుకున్నా …
కానీ కానీ .. కారునలుపు తారుడబ్బాల్లా ఇద్దరు కత్తులు బుజాన్నవేసుకుని మంచానికి చెరోపక్కనిలబడిఉన్నారు .
నోరు పెగల్లేదు. గొంతు తడారి పోయింది క్షణంలో తెరుచుకున్న నోరు మూసేలోగా …
👺“పద పద పద నీ కలలవల్ల ఇప్పటికే లేటైపోయింది”
అంటూనే చేరో భుజం పట్టుకుని లేపేశారు ,మంచంమీదనుంచీ
🤠ఏయ్ ఎవరుమీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు “ భయంగానే గొణిగా …
👺ఒరే బచ్ఛా ఇన్ని సినిమాలు చూస్తున్నావు మమ్మల్ని ఇంకా గుర్తుపట్టలేదారా ?
మీరు మమ్మల్ని ఇలా సినిమాల్లో చూపిస్తున్నారని
మా స్వంత “డ్రస్‌కోడ్”వదలి
మీ సినిమాల్లోలాగా@అర్ధనగ్నంగా ,
అందవికారంగా
తయ్యారై వస్తే గుర్తుపట్టవారా ? 👹అని
పళ్ళు పటపటా కొరికి , నెత్తిమీద మెత్తగా మొత్తాడు ఒకడు .
👺ఈ డ్రస్సుతో డ్యూటీదిగి ఇంటికి వెళ్తే మా ఆడాళ్ళు
ఆమడదూరం తప్పుకుంటున్నార్రా
మళ్ళీ స్నానంచేసి మా స్వంత డ్రస్‌వేసుకునేదాకా గొణుక్కుంటున్నాడు ఇంకొకటి 👹
@నాకు భయంతో వళ్ళంతా ముచ్చెమటలు పట్టేశాయి ఐనా అన్నగారు సీనియర్ ఎన్ టి ఆర్ ఇచ్చిన ధైర్యాన్ని కూడబెట్టుకుని దబాయించాను
🤠ఏంఅప్పుడే వచ్చారేం నేనే దొరికానా , నాకంటే ముసిలివాళ్ళు చాలామంది మూలన మూలుగుతున్నారు గా ముందు వాళ్ళని తీసుకెళ్ళండి ,
🤠నాకు చాలాపనులున్నాయి . కడుతున్న బిల్డింగు సగం కూడా కాలేదు , రావలసిన పెంక్షన్ రివిజన్ సుప్రీంకోర్టు లో పెండింగ్ లో ఉంది , రావలసిన భాకీలు చాలా ఉన్నాయి. మా అబ్బాయి అమాయకుడు వసూలు చెయ్యలేడు . ఇంకా చిన్నాచితక పనులు చాలా ఉన్నాయి . అవన్నీ పూర్తి చేసుకోవాలి . ఓ పదేళ్ళ తర్వాత రండి “ అన్నాను అప్పటికే గొంతెండి పోయింది .
👺ఓరే బడవా చచ్చిన తర్వాత కూడా పోలేదారా ఆశ ఆత్యాశ దురాశ , నడిమద్య లో వచ్చిన వాటిపై పిచ్చి వ్యామోహం @
👺వచ్చేటప్పుడు ఏమితెచ్చావ్ ఇప్పుడు నీతో ఏంతీసుకెళుతున్నావ్👹
(ఇది చాలాసార్లు విన్నాను అనుకున్నామనస్సులో)
👺రారా భచ్ఛా ట్రాఫిక్‌జామ్ ఐపోతుందిరా అక్కడ చిక్కుకుపోతే నువ్వన్న పదేళ్ళు ఇక్కడే అయిపోతాయిరోయ్ . ఆలస్యమైతే రావలసిన ప్రమోషన్ మాట యముడెరుగు , ఇంక్రిమెంట్ కట్ చేశేస్తాడా చిత్రగుప్తుడు 👹
బయటకు వచ్చేశామా
@రామారావుగారు జగదీష్‌గారు నరసింగరావుగారు గుప్తాగారు, వినోద్‍గారు
నన్నసలు పట్టించుకోకుండా వడి వడి గా పడి పడి నడుస్తున్నారు . మరో బ్యాచ్ వాళ్ళని దాటాలని వేగం పెంచుతున్నారు .
@ అరే నా నమస్కారానికి ప్రతినమస్కారం కరువైంది . ఇదేదీ పట్టనట్టు ధక్షిణామూర్తిగారు ధక్షిణ దిక్కు తిరిగి తూర్పున పార్కుకు వెళ్ళిపోతున్నారు .
ఇంకా రెండు మూడు బ్యాచ్చీలు రాజకీయ సంగతుల్లో తలమునకలై ఆవేశంగా అంగలు వేస్తున్నారు .
అలా నిలబడిన నన్ను ఆనల్లనోడు చల్లగా ఈడ్చుకెళుపోతున్నాడు .
@అలా దేశం పొలిమేర దాటామోలేదో వందల మందిని ఈడ్చుకెళ్ళుతున్నారు .
👺”అబ్బా ట్రాఫిక్‌పెరిగిపోయింది విసుక్కున్నాడు “ఒకడు 👹
🤠అయ్యా ఏమైనా అంటే అన్నానంటారు గానీ, ఒక్కబక్యోడికోసం ఇద్దరిద్దరెందుకు , ఇంకా సినిమా లో జూనియర్ యన్ టి ఆర్ కైతే మీ బాస్ విత్ దున్నపోతు తో ట్రాఫిక్ పెరగదా మరి “
🤠అవును నాదో డౌటు నన్నుతీసుకెళ్ళటానికి మీ బాస్ రాలేదేం నేనంత పనికి మాలిన వాడిలా కనిపిస్తున్నానా? మరీ చీప్‌గా, లేకపోతే కోవిడ్‌కి బయపడి …..
🤠ట్రాఫిక్ సరిపడా ఏదైనా స్పెషల్ టైన్ వేయించుకోవచ్చుగా
@ఆదాకి ఆదా మా హోదాకి తగ్గ@
🤠టూరిస్టు బస్సులు వద్దులే పెట్రోలు డీజిల్ అంత గిట్టుబాటు కాదులే .
@ ఇంతలోమాముదురుముసలోడు అందరినీ ఆదిలించి బెదిరించి తన సీనియారిటి వాడి ముందుకిదూసుకెళ్ళిపోతున్నాడు
🤠గురూ నాకో డౌటు ఎప్పుడూ నరకం నుంచీ మీరేవస్తారు ? స్వర్గంనుంచి ఎవ్వరూ రారేమిటి తీసుకెళ్ళటానికి🤔
🤠మావాళ్ళంతా అంటారు ఎవరైనా పోతే
“ వారికి స్వర్గలోక ప్రాప్తిరస్తు “ అని కానీ ఎవ్వరూ వెళ్ళిన ధాఖలాలు కనుపించలేదు . 🤠స్వర్గానికిఎవరైనావెళ్ళారంటావా? డౌట్ క్లీయర్ చేసుకుంటున్నా అంతే ………….🤔
కొంచెంసేపు నిశ్శభ్దం…….. 🫢
🤠ఓ పెద్దాయనా ఆయాసపడిపోతున్నావు కొంచెం రెష్టు తీసుకోరాదూ!!
(ఇందులో నా స్వార్థం ఉంది )
“సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా”అని
మెదటిసారి చంద్రుడ్ని చేరిన వాడెవడో అన్న మాటలు గుర్తుకొచ్చాయి”
@ కొంచెంసేపైనా నా దేశాన్ని తిలకించవచ్చని
కానీ కార్యదీక్షుడు ముసలోడేగానీ……. రొప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు
తప్పలేదు వెనకేవెళ్ళటం నావెనకఒకడున్నాడు గా మరి !
🤠గురువుగారు మా ఇండియాలోలాగా ఒక్కో రాష్టారానికి ఒక్కో విభాగం ఉంటుందా నరకంలో?
🤠మా తెలుగొళ్ళందరికీ ఒకటే ఉందా ?లేక కాంగ్రేసువాళ్ళ లాగా మీ బాసు కూడా తెలంగాణాని విడదీసేశాడా?
🤠మరి మా ఎన్ టీ ఆర్.
ఏ ఎన్‌ఆర్,సావిత్రీ ,శోభన్‌బాబు, బాల సుబ్రహ్మణ్యం, ముఖ్యంగా జ్యోతిలక్మీష వగైరా,
🤠మా ముఖ్యమంత్రి
రాజశేఖర్ రెడ్డిగారు, రోశయ్యగారు వగైరా …
వీళ్ళంతా ఒకే అపార్టుమెంట్ లోనే ఉంటున్నారా ?
డిపార్ట్ అయిపోయారాస్వర్గానికి !
🤠అపార్టుమెంట్‌లు వచ్చేశాయా ?
లేకపోతే పాపాలుచేసిన వాళ్ళేగా అని ఎండకీ వానకీ వదిలేసి మీమీ ఇళ్ళల్లో కాపురాలు చేసుకుంటున్నారా?! @మరో డౌటు ఇండియాకి ఒక నరకం ,స్వర్గం, అమెరికాకి మరొక స్వర్గం నరకం ఇలా అన్నిదేశాలకీ .. అదే Heven,Hell అంటారుగా !
@మౌనం.
@నేనడగడమే తప్ప అక్కడి నుండి నోనో రిప్లై
@నెమ్మదిగా అటునుంచీ నరుక్కు వద్దామని……
🤠భయ్యా మీకు ఎక్కువ గంటలు పనిచేస్తే ఓవర్ టైమ్ ఇస్తారా ? ప్రమోషన్‌లో
ఎన్ని గ్రేడులున్నాయి?
🤠మీలో కనీసం ఎవరైనా చిత్రగుప్తుడు స్థాయికి వచ్చారా? ఎందుకుంటే మీ మిగిలిన పోష్టుల వివరణ తెలియదుగా?
@నోరు తెరిచాడు
👺ఆ ప్రమోషన్స్ , ఓవర్‌టైం లు కూడానా మా కర్రిముఖాలకి , కనీసం ఒక రోజు సెలవు దొరకటం లేదు !!
👺తెచ్చిన వాడిని చేర్చేలోగా ఇంకొకడు తయారు . మీరు శిక్షాస్థలంలో ఉండేది నెలలో సంవత్సరాలో, కానీ మాజీవితాంతం ఆ వేడి దగ్గర, కాగే నూనె లో బ్రతకవలసిందే మాముఖాలు చూడు మాడి మసై సంసారానికి కూడా పనికిరాకుండాపోతున్నాం “ 👹 “@అక్కస్సంతా వెళ్ళగక్కుకున్నాడు ఆ నల్లముఖాన తేటతెల్లంగా కనిపిస్తుంది “
🤠అవును భయ్యా ! నూనె అంటే గుర్తొచ్చింది అంత మంచి నూనె ఇంతమందికి సరిపడా ఎక్కడనుండీ దొరుకుతుంది ?
🤠దిగుమతి చేసుకుందామన్నా ఎవడి నరకానికి వాడి నూనె సరిపోడతుందిగా !
🤠“కొంపతీసి వాడిన నూనెనే మళ్ళీమళ్ళీ వాడేస్తున్నారా ఏమిటి ? రోగాలు రావు ? 🤠🤠
చచ్చినోడికి రోగాలేంటంటారా! 🤠🤠మీకుకావాలంటే
వేరు శెనగ, నువ్వుల నూనెలు పెట్రోలియం వ్యర్దాలనుంచీ బ్యారెన్లు బ్యారెన్లు తయారుచేసి ఇస్తారు ,
🤠కావాలంటే కాంట్రాక్టు అగ్రిమెంట్ అవ్వమనండి మీబాస్ ని మీకూ మంచి కమీసనిస్తారు “
👺ఏడ్చినట్టుంది “మెదటిదానికి మొగుడు లేడు కడదానికి కల్యాణమన్నాడంట “వెనకటికి మీవాడు . మిమ్మల్నితేవటానికే మా జీవితకాలం సరిపోవటంలేదు ఇది చెప్పితే వెళ్ళినప్పుడల్లా ఒక బ్యారన్ మోసుకురమ్మంటాడు వద్దు వద్దు 👹అన్నాడు.
🤠మరెలా మేనేజ్‌చేస్తున్నారో?
👺నీళ్ళలో వేపుతున్నాము “నవ్వాడు
@నీళ్ళా@ నోరెళ్ళపెట్టా
🤠మేము సంవత్సరం పొడుగునా నీళ్ళకోసం కొట్టుకుచస్తుంటే మీకు నీళ్ళెక్కడివి భయ్యా “?!!!
👺చెవిలో చిన్నగా చెప్పాడు
“శివయ్యకి మొరపెట్టుకుంటే , అనుగ్రహించి ఒక జడఝాటం ఇటు విసిరాడు . గంగమ్మ జల ధారాళం పునీతం చేస్తుంది .
🤠ఐతే మా పాపాలన్నీ పోవాలే? ?
👺హమ్మయ్య నరకధ్వారం వచ్చేసింది తలుపులు మూసేలోగా దూరిపోవాలి మరేమీ అడగకుండా అడుగెయ్యి “”కానీ ఇక్కడే ట్విష్ట్
@@అక్కడ సెక్యూరిటీ యమ భటుడు నా ఆధార్‌కార్డు వెరిఫైచేసి , మాముసలి భటుడిని ఎర్రగా చూసి
“ వయస్సు పెరుగుతుందిగా కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు .
$$Wrong pickup so no entry$$
(పాపం వాళ్ళకి తెలియదు అది నా డిస్‌కార్డు చేసిన ఆధార్ కార్డు అని “ జస్ట్ ఫర్ జోక్)
అని తలుపు వేశేశాడు గట్టిగా 🤔
@మనోళ్ళ ముఖాలు నల్లని ఎరుపెక్కాయి. 👺నువ్వు దారి పొడుగునా అలా వాగుతున్నప్పుడైనా అనుమానం రాలేదురా నీమీద అని వెనక్కితిప్పి ఒక్క తన్ను తన్నాడు నన్ను . 👹
@ అంతే గాలిలో రాకెట్టును మించిన వేగంగా భూమి వైపు దూసుకొస్తున్నా , పేయిలైన రాకెట్టులా ఎక్కడ కాలిపోతానో అని భయం , ఎక్కడ ఏ కాలో చెయ్యో విరిగి పోతుందో , ఏ అడవుల్లో పడిపోతానో ………….
చేతిమీద ఏదో గుచ్చుకున్న బాధ
🤠“అమ్మా” అరుస్తూ కళ్ళు తెరిస్తే నల్లవాళ్ళకి బదులు గా
తెల్ల బట్టలు తో అటు ఇటు నిలబడి ఉన్నారు డాక్టర్, సిష్టర్ చెరోప్రక్క
@ నెమ్మదిగా “డాక్టర్ మందలించినట్టు , భయం నటిస్తూనర్సమ్మ
@@దూరంగా ఆగమేఘాల మీద అమెరికా నుంచీ
వచ్చిన అబ్బాయి, అబూదాబీనుంచీ వచ్చిన అమ్మాయి ఆదోళన నిండిన @ముఖాల్లో, నేను కదలటం,కళ్ళు తెరవటం కనిపెట్టారేమో వాళ్ళకళ్ళు తుడుచుకుంటూ మసకమసకగా కనిపింది అలా అనిపించింది “
ఃఃఈ సంఘటన జరిగి ఈరోజుకి యాడాది పూర్తయింది
నన్ను ఆ సంఘటన నుండి బయటపడేసిన @జగనన్న పెట్టిన “”108 “”
(ప్రైవేటు వాడు Ola hand ఇచ్చి బుక్ చేసిన కాబ్ క్యాన్సి ల్ చేసుకున్నాడు, ప్రభుత్వవాహనం 108 సమయానికి వచ్చి ప్రాణం నిలబెట్టింది )
🙏🙏మరీ ముఖ్యమైన వారు అర్దరాత్రి నా ఆర్థనాదానికి స్పందించిన ఓషియానా కుటుంబ సభ్యులు దినేష్ ( వరలక్ష్మి గారి అబ్బాయి), డాక్టర్ రాము గారు ,
శివరామ్ గారు ,
మరో జంటిల్‌మాన్ పేరు (తెలియలేదు, )
మరియు ఆసమయంలో నా ఆరోగ్యం బాగుకోరిన బందువులు, మిత్రులకు ,శ్రేయోభిలాసులకు అందరికీ మీకు మరోసారి నా కృతజ్ఞతాభినందనలు🙏❤️🙏
ఈ రాత నా “రాత మార్చిన” మీకు అందరికీ అంకితం
💐💐 💐💐💐💐💐💐💐. 💐💐
మీ ముత్యాల 🤡.
షరా:: కథ మాత్రం ఇంకా ఉంది మీ స్పందన బట్టి కోనసాగిస్తానండి..
Comments
Post a Comment