రాజ్యాంగ నిర్మాతా
భారత రాజ్యాంగ నిర్మాతా బాబా అంబేధ్కరుడా అందుకో నా వందనాలు పాదాభి శిరసాది అభినందనలు 🙏
నా తల రాతను తిరగరాసిన నా ప్రియమైన దైవమా,
నెత్తిన ఉన్న మట్టి తట్ట తీసి,
అక్షరాల బుట్టను తలకెక్కించి ,
డిగ్రీల టోపీలు ధరింపచేసి,
నేలచూపులు మాని
నీలాకాశం వైపు చూడగలిగే దైర్యాన్ని ఇచ్చిన వేగుచుక్కా
వీర సైనాధిపతి రెడ్‌సెల్యూట్‌లు
నీవిచ్చిన స్వేచ్ఛ తో ఈ 70 వ ఏటి వరకూ నన్ను నే రక్షించుకుంటూ
నా జాతీయులకు నా పరిదిలో సాయపడుతూ గడప గలిగాను నీ రూపం మనస్సున నిలుపుకొని.............. 🌺
నిత్య నవ రాజ్యాంగ నిర్మాతా అంభేధ్కర్‌మహోదయా నీకివే నా నివాళులు 🌹♥️🌹
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment