జాము రాతిరి జాబిలమ్మ..




 

జాము రాతిరి జాబిలమ్మ….. చందమామ తన ముఖ అందాన్ని సాగరంలో చూసుకుంటూ మురిసిపోతున్న వేళ  నగర జనం సగం పైనే ఆ సముద్రపు అలల లా  బీచ్‌ అంచుల్లో పోటీ పడి మరీ “పోటెక్కి” పోతున్న వేళ   సన సన్నని చిరుగాలి ప్రతి చెక్కిలి ముద్దాడతూ తన్మయపరుస్తున్న వేళ   చిరు జల్లుల జడి వాన మేనునంతా తడిమి చెక్కిలిగింతలు పేడుతున్న వేళ   ఐనా ఈ నిప్పుల కుంపటి చిరిగిన చత్రం కింద విసన విసుర్లకు చెలరేగి ఎగిరెగిపడుతూ జొన్నపొత్తుల్ని ఒడిసిపట్టి ఓలలాడిస్తున్న వేళ   పిడత క్రింద పప్పు చిందే పొగ వాసన మస్తికం చేరి నాసికం ద్రవం ఊరి దరి చేరే వేళ   విశాఖ బీచ్‌ పేమస్‌  “ మురీ మిక్సీ” బండి చుట్టూ  దండులు దండులు గా దండెత్తి ముట్టడించి నోరారా ఆరగించి ఆ రుచిని ఆస్వాదించి అంత కారంలోనూ మమకారం పెరిగి “ఒన్‌ మోర్‌ ప్లీజ్ “ అని   “ ఆహా ఏమి రుచి తినరా మైమరచి “ అని  కారం ఘాటుని నిమ్మ నీరు కొంత  నిమ్మది పరుస్తున్న వేళ   “చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు “అంటూ “కారు”మేఘాల చాటున నక్కినయ్యను కరెంటు దీపాల వెలుగు లో వెదుకుంటూ ………. తమ తమ కారు వాహనాల్ని వెదుక్కుంటూ సాగే జన సంద్రమ్  “కాళీ అయిన జేబుల నిండా సంతోషానందాలని నింపుకుని ఆ కాళీ మాత ఆలయం దాటి ……   ముత్యాల 🤡.

Comments

Popular posts from this blog

శివ సన్యాసి

“కరోనా “ నమస్తే

జలపాతం