మన్యం దొర






మన్యం దొర మన “అల్లూరి”  తెల్లవాడి మర పిరంగులకు, తుపాకీ తూటాలకు, ఎదురుగా అడవి బిడ్డల “చరా” లకు తన యుద్దతంత్రాలను జోడించి వాడి గుండెలదర యధపై గండ్రగొడ్డళ్ళ నూరిన మహా సేనాని .  “విల్లు ఎక్కపెట్టి నారి సారించి చరాలవానలు కురిపించి వాడి  “నరాల నార” తీసిన అరివీరభయంకరుడు  అభినవ అర్జునుడు  అడవి తల్లి బిడ్డలు గండు చీమల దండు తో తెల్లవాడి కండలూడ పెరికించిన యద్దనీతి ప్రజ్ఞుడు అపరశానిక్యడు శ్రీ సీతారామ రాజు  బ్రిటీష్‌ గుండెలు బీట్లు కావించి , కంట్లో కాలే నలుసై స్వతంత్ర పోరుకు సాయుధ భాట చూపిన తొలి దేశభక్తీసారధి తెలుగు నేల కన్నబిడ్డ “అల్లూరి”  ఆడ బిడ్డల మానం ప్రాణాలు  కాపాడే క్రమంలో క్రమశిక్షణ గల సైనికుడిలా గగనానికేగిన *క్రాంతి కపోతం**  భారత మాత బానిస సంకెళ్లు తెగనరికే మహా యజ్ఞం లో సమిద అయిన ఎర్రని కణం ఇంకా కణకణ లాడుతూ నూరేళ్ళు బ్రతికిఉన్న “అమరజీవి ఆమరణదివ్వె “  మన తెలుగు వారి కాగడా దివ్వె అల్లూరి   ముకుళ్ళిత హస్తాలతో గుండెనిండా గర్వం నింపుకు చేద్దాం నినదిధామ్  జోహార్‌ అల్లూరి  జోహార్లు జోహార్లు  ❤️🌹❤️💐💐💐💐💐💐

Comments

Popular posts from this blog

భార్గవ రాము

“కరోనా “ నమస్తే

శివ సన్యాసి