కోయిల గోల

 కోయిల గోల




ఈమధ్య ఓ కోయిలమ్మ రాత్రనకా, పగలనకా తెగకూసేస్తుంది గమనించారా?

సారీ కూయటం కాదు “అరుస్తుంది “ 

అవునండీ ఓ సమయం సంధర్బం లేకుండా గొంతెండి పోయేలా “అరుస్తూనే” ఉంది 

దాని పాటలో “కమ్మదనం”పోయింది 

బొంగురుపోయిన గాత్రం గాడిద ను మరిపిస్తున్నది

కవితలో కవ్వింపులే కనబడుతున్నాయి


తినగ తినగ “వేము”తియ్యనుండేమో గాని 

వినగ వినగ దాని “రాగం”

వెగటు గుండె


గుండెలవసేలా “అరుస్తుంది”

దాని గోలకి కాకులు కూడా “కామ్‌” అయిపోయాయి

కాకి గోలలు లేవు దాని గోలే వినిపిస్తూంది 


వాకబ్‌ చేశా ।!

అవి ఆకలి కేకలు కావు 

తోడుకోసం వేసే కవ్వింపు హేళ అరుపులు

పాపం వంటరై దిక్కు తోచక దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంది

వండింది తినే “నాధుడు”కరువై చేస్తున్న విరహ గానాలవి.



ఇది ,మరో ప్రపంచంలో స్వేచ్ఛాపవనాల లోవిహరిస్తున్న పచ్చిరెక్కల  ముక్కుపచ్చలారని కూన కోకిల

ట్విట్టర్‌లోను, ఇన్‌ష్టాగ్రాముల్లోను, చివరికి ఫేసుబుక్కుల్లోదూరి నడిసంద్రాన ఎవరైనా దొరుకుతారేమోనని వెదుక్కుంటుంది 

తన “నల్ల”ని అందం చూసి ఎవరొస్తారు 

ఆ ! నల్లనైతేనేమి ఎర్రని నిప్పుల్లాంటి కళ్ళు ,ముక్కు , కారునలుపులో కళగానే ఉంటుందిగా! 

అమ్మా కాదు కాదు “అమ్మో” కాకులు కాకుల కంటబడిందండీ

ఇష్టపడ్డాయి 

“ఇన్‌ష్టాగ్రామా మజాకా “ 

మాటా మంతీ పెరిగింది మనస్సులు కలిశాయి …….

…..మరోదారి లేక మనస్సు పడిందేమో ? 

కాకిని నమ్మితే కష్టమని తెలుసుుంది . కాకి , ఒక్కర్తేరాదుగా   కాకి కాకులతో పంచుకుంటుంది అది ప్రేమైనా , ఇంకేమైనా 

కోకిలకు ఇష్టం పోయింది ఖష్టమైయంది 

కాకులు , అంతతేలికగా వదిలితే అవి కాకులెలా అవుతాయి 


కోకిలకు తెలియదు పాపం 

తనూ పాపం చేసిందని,

సరి”హద్దులు “ దాటి చాలా దూరం వచ్చేసిందని 

తనా అనేవారు అగుపించనంత దూరంగా. 

కాకి(కుల) చేతిలో సురకత్తులున్నాయని 

కుత్తుకల్ని ఖర్కశంగా నరికి వేస్తాయని , అదిమి అదిమి గుండెల్లో గునపంలా గుచ్చి వేస్తాయని ……………।।

………రెక్కలు తెగి రక్తపుమడుగులో విలవిలలాడుతూ అల్లలాడుతూ, ప్రాణవాయువు కటై అనంతవాయువుల్లో కలిసిపోయింది ఆ చిన్నారి కోకిల ఆత్మ ……………….

అంతే 

మాట్లాడటం మెదలు పెట్టాయి అన్నిరకాల “నర” జాతి పక్షులు

“కోకిల తప్పా, కా”కీ”ల తప్పా , రాజాతప్పా , ఆ పోయిన రాజా తప్పా , సోధ్యం చూస్తున్న చుట్టూ ఉన్న చెట్టూ సేమా తప్పా , చెట్ల చాటున నక్కి రాసుకుపోతున్న కామిడీ మీడియా తప్పా . 

కంటిపాపలా పెంచుకున్న “ పాప”ప్రాణం పోయాక తల్లి కి ఇచ్చే అక్షర,లక్షలు తేగలవా ఆ పిల్లకోకిలని ?

నాకసలు అర్ధం కావటంలా 

ఈ ఘోరఖలిని ఆపలేమా ??

అయ్యో మర్చిపోయా! 

ఇది కలికాలంకదూ? 

కావలసిందే 

కాలవలసిందే రావణకాష్ఠం 

కడవరకూ ఖర్మభూమి కూడా కడలిలో కలిసిపోయేవరకూ…….

యుగాంతం జరిగేవరకా …!!🙏


మీ

ముత్యాల 🫣


(మన చుట్టు పక్కల నుంచీ వినబడే కోకిల గొంతు విని నా గొంతు లో పలికాయి ఈ మాటలు )

Comments

Popular posts from this blog

శివ సన్యాసి

“కరోనా “ నమస్తే

జలపాతం