ఏమిటీ వైపరీత్యం
ఏమిటీ వైపరీత్యం 🤔.
నీలి సముద్రం ఎలా నల్ల సముద్రాన్ని తలపిస్తూందో
తాపం తాళలేక తీరం దాటే యత్నం లో తెల్లని నురగలు కక్కేసుంది. 🤔
మన భవన సముదాయం మొత్తం వేడికి తాళలేక “తెల్లబారి”పోయింది 🤔
పచ్చని వృక్ష సంపద చావుకి దగ్గరౌతున్నామా అనే బెంగతో వేళ్ళాడిపోతున్నాయి 🤫🫢
ఆ నిర్మాణంలో ఉన్న నూతన కట్టడం కదిలి పోకుండా
“కర్ర కట్లు “వేసుకుంది 🤭🫣
వేసవి కాలం ,వర్షాకాలం ,చలికాలం కాదు గుర్తుంచుకోండి
ఇది “”కలికాలం”” 🥵👹
అంచేత అందరూ అడుగు బయట పెట్టేముందు
“అర”సారైనా ఆలోచించండి
పైన నెత్తిన బొచ్చున్నా, లేకున్నా , పెట్టండి మీకు మీరే ఒక టోపీ 🤗🤗
ఆడ లేడీసైతే తీయండి మీ చేతి బ్యాగులో “ చత్రం “ 🫡🫡
“చెక్ “పెడదాము ఆ సూర్య ప్రతాపానికి ..🤠🫶
సాగిద్ధాం జీవన నౌకలు ఆ అగుపించే మర ఓడల్లా😜🤪
మీ ముత్యాల 🤡🤡
Comments
Post a Comment