ఫోటో FACE

😎😎😎ఫోటో FACE 🤠🤠🤠


ఫోటోలు ఒకప్పుడు ఫేముల్లో

తరువాత

ఆల్‌బమ్‌ పుస్తకాల్లో

ఇప్పుడు 

“సెల్‌” పోనుల్లో 

రేపు 

?????? ?????

ప్రేముల్లో గోడల మీద ఎప్పుడూ అందరి కళ్ళ ముందే కనిపిస్తూ ఉండేవండీ 

వాటిని పుస్తకాల్లో చేర్చి , మనస్సుకీ , మస్తకానికీ దూరం చేశాము

మనకి మరీ పనిలేకపోతే తప్ప అవి కనిపించటం మానేశాయి 


మరిప్పుడా  సెల్‌పోనుల్లో…..

“సెల్‌” లో “చెర” లో బందీలై

మరుచటి నాడే  

మరుగై మాసిపోతున్నాయి 

రోజు రోజుకీ వందల్లో చేరే వరదనీటిలో ఒంటరి ఓల్డు బొట్టులా @గ్యాలక్షీ @నడి సంద్రాన మునిగిపోతున్నాయి


ఏడాదికో అందులో అరకో అప్పుడప్పుడూ

 @గూగుల్‌ పోటోస్‌@ పుణ్యమా అని  

ఎడారి ఇసుకలో ఏరి కొన్ని అందిస్తే తప్ప , మన మెదడు “మెమరీ” కార్డుల్లో బ్లింకు కావు 

ఆ సింకైన పాత పోటోలు “గ్యాలరీ” లోకి………….

ఇదే అదును ఒకటికాదు, రెండుకాదు, మూడు, నాలుగు కెమారాలు కూర్చి అధిక లాభాలు గుంజుకుంటున్నాయి సె…

[8:33 PM, 9/5/2022] Raja: శ్రీ సాయిరామా,”రమా” నామేసు ధ్వయ

“స్వయ ఆలోచన” సఫల సమయమాసన్నమైన సుముహూర్తవేళ..

రమ “ప్రియసఖులు “( మిత్రబ్ృందం 

సందడి సందడితో పెళ్ళిపందిరి

 (ఇల్లు పీకి) చేసినవేళ………..

రంగురంగులతో వేదికనలంకరించి, 

తమ తమ “హరి” చేతులపై 

“ముత్యాల ముగ్గులరంకరించి”

పెళ్ళిముగ్గులునే మరిపించి,మరిపించిన వేళ……….

“అదిగోనయ్యా సాయిరామా! 

మా”రమ”

కనులవిందుగా, నీ కనుదోయి అదరగా 

సర్వాంగ సుందరంగా అలంకరించుకు 

నీకై కనురెప్పలు ఆర్పక నిరీక్షిస్తున్నవేళ…


రమ హృదయం గెలిచిన ,విల్లు విరిచిన శ్రీరా”ముని” లా కదలిరావయ్యా మారమ తపస్సు  ఫలించినవేళ …………………..

వివాహ సుముహూర్తమాసన్నమైన వేళ.


మా అందరి” శుభాషిస్సులు” అక్షితలుగా భావించి 

మంగళప్రధ సమయానికి “మంగళసూత్ర” ధారణకావించి మాఅందరి మనస్సుల సంతోష మిటాయి నింపంగా……………….,


మరి కొద్దిగంటల్లో

“రమా,రామ్‌ల మద్య కామా పోయి 

మా’ రమా 

మీ “రమారామ్‌” మారువేళ…………

మీకివే మా శత…

[8:33 PM, 9/5/2022] Raja: బ్రాకెట్టు ఆట అటకెక్కిపోయింది అలాగే జాకెట్లు కాస్తా కనుమరుగైపోతున్నాయి మన పుట్టగొడుగు చానళ్ళ పుణ్యాన.    


జాకెట్లలో కనిపించీ కనిపించకుండా మన కళ్ళతో దోబూచలాడే”బ్రాలు “ బజారు కెక్కాయి బరితెగించి ..


ఇప్పుడు “బేర్”బాడీ మీద బట్టబయలైపోయాయి 😳.                    రవికలు జాకెట్లు పెనంమీద పెసరట్టులా మాడి మాయమైపోతున్నాయి 


క్రమక్రమంగా కాలం చేతిలో “స్మార్టు” గా మలచబడి పలచబడి పోతున్నాయి                    వెన్నుపూసకి అతికించిన గుడ్డ పీలికలైపోయాయి 

జానాబెట్టడై “తన ఉనికిని కాపాడుకునే అవస్థ లో సతమతమౌతూనే “సంకల”దాకా కుదించుకు పోయాయి            అయో సంకనాకిపోయాయి 😔.  బ్రాలు మాత్రం ? 

అప్పటిలో బలంగా పైనున్న రవికకి ధీటుగా తగ్గకుండా ధీమాగానే ఉండేవి

ప్రస్తుతం రవికల రంగు ఎలవటం చూసి రంకెలేస్తూ బాహ్యప్రపంచంలో పడి జాకెట్ల ( )సేఫ్‌ జోను వీడి “చిన్న చిన్న పీలికలై వేలాడుతున్నాయి🫣మరికొన్ని ఆ గుడ్డపీలికలే కరువై స్థన ద్యయ సాయంతో గాలిలో కాలం గడుపుతున్నాయి క్రమేపీ గాలిలో కలిసి”పోయే”రోజు కోసం. .


……ఎనకటికీ ఆ రోజుల్లో 

10 ఏళ్ళు దాటిన పాప ని గౌను వేసుకోమంటే “ ఆ పిల్ల , పిల్లతల్లీ కూడా “NO” అనేవారు 

🤔మరి ఈ చానళ్ళ “షో “ల్లో 20 ఏళ్ళ పిల్లలున్న తల్లులు సైతం  @ఆ@ సాంతం వదిలి కురస పొట్టి గౌనులు మెడకి ఏలాడదీసుకుంటున్నారు 😳🫣

ఏమో ఎవరికి తెలుసు ?🤔🫠

స్కూలు “డ్రస్”  కోడ్‌ లా వాళ్ళకదే “@డ్రస్‌కోడేమో”

ఏమో😡?


ః……. వాళ్ళమ్మాయికి పెళై , పెళ్ళీడుకొచ్చిన పిల్లలున్నా తల నెరవదు “ఓ” కలరింగా 

మరి పీలికల మోడ్రన్ రవికలూ       సిల్క్ చీరలూ ? డ్రస్‌ కోడ్‌ మారదే 

ఏమో ! 

ఎవ్వరైనా హీరోయిన్‌ “పాత్ర” దానం చెయ్యకపోరా “దురాశ” ..

మరి సీరియల్స్ యమ సీరియస్‌గా చూసేవాళ్ళం 🤥


వాళ్ళ పాత్రలు తదేకంగా తన్మయత్వం తో (కడిగే పాత్రలు వదిలేసి మరీ”) చూస్తున్నామా! 

 @చానల్‌ చూసినా ఏమున్నది…

టీవీ జాతి చరిత్రమెత్తం 

“స్త్రీ జాతి “విలనీల నిలయం@

నాయకీ, నాయకులంతా నామమాత్ర పాత్రలే కదా🤗.             “పట్టవదలని విక్రమార్కుడి లెఖ్ఖ 

బేతాళుడు చెట్టెక్కిప్పుడల్లా చెట్టుపైకెక్కి శవాన్ని భుజాన్నవేసుకున్న లేఖ🤗

స్త్రీ విలనమ్మ పన్నే వలయంలో చిక్కుముడులు విప్పేలోగా “భేతాళుడు “ మాయం రేపటి వరకూ……….

నా చిన్నప్పటి

 “భేతాళుడు కథలు” అనేవారు అవి ఈ టీవీ సీరియల్స్ ముందు దిగదుడుపే 

అవి ఆలోసింపచేశేవి మరి ఇవి ఆలోచనల అవసరంలేకుండా ….

ఆదివారం ఎప్పుడైపోతుందా అని ఎదురు చూపులు 

ముందైతే ఆదివారం ఎప్పుడొస్తుందా అని. 

“మొగుడు , పిల్లలు ఆరోజంతా ఇంట్లోనే , మరెక్కడికైనా వెళ్ళి ఆనందంగా గడిపేవాళ్ళం”

ఎక్కడ వెదుక్కుంటున్నాం ఆనందాన్ని ఆలోచించండి 🤔😔


“మన మెదడుని ఎవరికి అద్దెకిస్తున్నాం ? పైగా కిరాయి మనమే ఎదురు కట్టిమరీ “.                రాను రాను 

“పూర్తిగా మారిన చంద్రముఖి “ లా మారిపోకముందే ?????


అనుమానం, అవమానం,అసహ్యం,

అసంధర్బం,అమానుషం , అపోహలు, అనవసరాలు,అన్నీ మిక్సీలో రంగరించి రంగులతో యేమార్చి , మద మత్తెక్కించే విషమందు సూటిగా సూది సాయం లేకుండా మన మస్తకంలో ఎక్కించేస్తున్నారే ?             పర్యవసానం తెల్లవారి పేపర్లు తిరగేస్తే తెలియటంలా                        “ఎన్ని నిండు ప్రాణాలు తెల్లారిపోతున్నాయో , ఇంకెన్ని జీవితాలు ఇంకిపోతున్నాయో ? 


అర్ధంకాదు🤥😔

…….మరి మహిళలు ఎందుకు అంత ముచ్చటగా చూస్తున్నారు 

మన విలన్‌ల సంఖ్య పెరిగిదనా?

ఆయా పాత్రల్లో (ఏఏ)వాళ్ళకు అన్వయించుకుంటున్నారా?

కాలక్షేపమా ! కాకరకాయేంకాదు 


మగమహారాజులూ

 “అంతేగా అంతేగా” అని పోటీ పడి మరీ చూస్తున్నారుగా!😡.      ఏమిటీ బయట గోల , గొడవ ఏవో కేకలు 

ఏమిటీ “ అన్నిచానళ్ళలో సీరియల్లా మేము చూడలేకపోతున్నాముూ” అలా చూసేలా ప్రభుత్వం చర్యలుతీసుకోవాలా?”

లేదంటే రాబోయే ఏన్నికల్లో మీ తడాకా ఏమిటో చూపిస్తారా?”


@ఓరి వెర్రి పూవ్వా @ 

ఎక్కడ చానళ్ళు మార్చి మూరిపోతారో నని 

వాళ్ళెప్పుడో రింగై ఎవరి రింగు కి వాళ్ళు గోడకట్టేశారు 

అడర్‌స్టాండిగై అడ్వర్టైజుమెంట్ల కాలం సకాలం ఏకకాలంలో ఇస్తున్నారే🤔. 

ఇక మిగిలినవన్నీ సేమ్‌ టు సేమ్‌ 

“సంగీతం “

ఎప్పుడో ఏడుసంద్రల్లో కలిపోయింది . మ్యూజిక్‌ లో మాజిక్‌ లొచ్చాయి 

పళ్ళాలు,తపేళాలు,గంగాళాల మీద ఎంత గట్టిగా కొడితే అంత భయానకం, భయంకరం. 

ఆడవాళ్ళఏడుపులు కాదిప్పుడు , మగాళ్ళు ఎంత గట్టిగా “గాడిద కాంభోజ రాగాలు తీస్తే , గంభీర , భయానక, విచార నాధాలు …..😩

హా హా ……. మెలుకవ వచ్చేసంది      కలలు కరిగిపోయాయి  బయటపడలేని  బయటపెట్టలేని నిజాలు  కనీసం కలలోనైనా తీరింది 

కాఫీతో మాఆవిడ ఎదురుగా 🤫🤭🤫🤭🤫🤫🤭🤭🤫🤫

Comments

Popular posts from this blog

శివ సన్యాసి

“కరోనా “ నమస్తే

జలపాతం