ఆహ్వానం [for Oceana]
💐 ఆహ్వానం 💐
ఓం గణాధిపతిగా మాధళపతీ వినాయకా! స్వస్తిశ్యీ చాంద్రమాస శ్రీశుభకృత్ నామసంవత్సర శుధచవితి ది॥31-8-2022 రోజున .. మూషిక వాహడవై నీ మందీ మార్బలం తో దండెత్తి రా రావయ్యా వినాయకా మహానాయకా🙏🙏 తాళమేళాల స్తుతి దండకాల తో ఉండ్రాళ్ళతో ఫల పూల తో ధూప ధ్వీప నేతి నైవేధ్యాల ,పప్పు బెల్లాల తో , వడ పాయసాలతో స్వాగతిస్తూ ఎదురు చూస్తున్నాము మా ఉండ్రాళ్ళ “గుండ్లు”వర్షాన భక్తిగానాల కీర్తించగా నీ లంభోదరం నిండగా మా పూజలంది, మంగళవాధ్యాలు , వేదమంత్రాల గొంతులు మారుమ్రోగంగా , నీ తొండము ,ఏకదంత ద్వయము నేయికారుచుండ, నీ మూషికము కొబ్బరి చిప్ప నములుచుండ, ఇంక ఏది నీకేది మరోదారి ….మమ్ములను ఆశీర్వదించకుండా … నీ చిన్నని “కరి”కళ్ళ చల్లని చూపులు ,నీ తొండము మా శిరస్సుల తాకి మేను పరవసించిన వేళ ఉండగలమా చిందులేయకుండా! ఎవ్వరాపగలరు మాభక్తగణాన్ని ఆ ఆనందాల వరదలో కొట్టుకుపోకుండా !! నీ ప్రసాదామృతం సేవిస్తూ ఉంటాము ముచ్చటగా మూడురోజులు నీపాదసేవలో! గడచిన మూడు వత్సరాలు నిన్ను బహిరంగంగా రమ్మనలేక స్వంతఇంటనే బందీలమైపోయాము . గదిలోనే మదిలో ద్యానించుకుంటూ !! క్రమశిక్షణగలిగిన ఖైదీలను విడుదలచేసిన చందాన , నీ ఆశిస్సులతో బతికి బట్టకట్టి ఇప్పుడిప్పుడే భాహ్యప్రపంచం చూడగలిగుతున్నామయ్యా. ఇందుకు ప్రతిగా కృతజ్ఞతగా వేడుకుంటున్నామయ్యా ఓ కరి ముఖదైవమా విచేయవయ్యా మా నాయకా వినాయకా !! ఓ విఘ్నేశ్వరా పెద్ద విఘ్నాలనే దాటించిన నిన్ను ఏవిఘ్నమూ రాకుండా కాపాడమనడం అవివేకంగా లేదు ? కానీ అల్పులం, ఆశావాదులం కాబట్టే మళ్ళీ మళ్ళీ అదే కోరుకుంటాము ! నీ ఏకదంతంచాటున చిధ్విలాసం చిరునవ్వులు నవ్వుకో , కానీ అభయం మాత్రం ఇవ్వు అన్నీ నువ్వు చూసుకుంటావని ! “ఏ విఘ్నం మాఇంటి గడప తాకదని , నీ ఒక్రతుండం ఎల్లప్పుడూ మాఅండనే రక్షణ కవచమై ఉంటుందని .! “”@తధాస్తూ@“” నీ నోట అన్నావా ! ఆ వినిపించింది వినిపించింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మన ప్రార్థన మన్నించబడింది మన ఆహ్వానానికి అనుమతి లభించిం
Comments
Post a Comment