కోయిల గోల ఈమధ్య ఓ కోయిలమ్మ రాత్రనకా, పగలనకా తెగకూసేస్తుంది గమనించారా? సారీ కూయటం కాదు “అరుస్తుంది “ అవునండీ ఓ సమయం సంధర్బం లేకుండా గొంతెండి పోయేలా “అరుస్తూనే” ఉంది దాని పాటలో “కమ్మదనం”పోయింది బొంగురుపోయిన గాత్రం గాడిద ను మరిపిస్తున్నది కవితలో కవ్వింపులే కనబడుతున్నాయి తినగ తినగ “వేము”తియ్యనుండేమో గాని వినగ వినగ దాని “రాగం” వెగటు గుండె గుండెలవసేలా “అరుస్తుంది” దాని గోలకి కాకులు కూడా “కామ్” అయిపోయాయి కాకి గోలలు లేవు దాని గోలే వినిపిస్తూంది వాకబ్ చేశా ।! అవి ఆకలి కేకలు కావు తోడుకోసం వేసే కవ్వింపు హేళ అరుపులు పాపం వంటరై దిక్కు తోచక దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంది వండింది తినే “నాధుడు”కరువై చేస్తున్న విరహ గానాలవి. ఇది ,మరో ప్రపంచంలో స్వేచ్ఛాపవనాల లోవిహరిస్తున్న పచ్చిరెక్కల ముక్కుపచ్చలారని కూన కోకిల ట్విట్టర్‌లోను, ఇన్‌ష్టాగ్రాముల్లోను, చివరికి ఫేసుబుక్కుల్లోదూరి నడిసంద్రాన ఎవరైనా దొరుకుతారేమోనని వెదుక్కుంటుంది తన “నల్ల”ని అందం చూసి ఎవరొస్తారు ఆ ! నల్లనైతేనేమి ఎర్రని నిప్పుల్లాంటి కళ్ళు ,ముక్కు , కారునలుపులో కళగానే ఉంటుందిగా!...