Posts

Showing posts from September, 2022

“కరోనా “ నమస్తే

 “కరోనా “ నమస్తే   భరోనా మందు తో పొట్ట  నో వర్రీనా ధర ఎంతన్నా వద్దన్నా నింపుతాది ఎల్‌‌ జీ గ్యాస్‌ విశాకన్నా  భయం వీడి బతుకుదాం  ఉన్న కొంతకాలమన్నా  అంటే బరితెగించి కాదన్నో ప్రభువులు చెప్పినట్టు  పిలుద్దాం కరోనా ని  సహజీవనం చేద్దాం రమ్మని కనీసం మే పదిహేడు తరవాతైనా నమస్తే అంటూ మీ ముత్యాల😘

భార్గవ రాము

Image
భార్గవ రాముని ఆగమనం  బందుజనానికి ఆనందం  సంతోషోత్సవాల ప్రారంభం  యామినీ చిరకాల ఆకాంక్ష  సుధాకరుని సుదీర్ఘ వాంచ  భార్గవ రాముని రూపం విరించ  “ఆలస్యమైయిందమ్మా “ అని  అమ్మని కాకా పట్టి  అమ్మ ఎద ఒదిగి ఆద మరిపించి  తాను మైమరచి నిదురించు రామా  రా వయ్యా ఈ దరిత్రికి  స్వాగతం సుస్వాగతం  శుభాకాంక్షలు యామిని సుధాకరులకు  శుభాషిస్సులు మీ కుమారుడికి 🙌 ♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹🍎🍎🍎🎈🎈🎈🍎🍎🍎🎈🎈🎈💐💐💐💐💐💐💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂 పై మెస్సేజ్‌ సుధాకర్ వాళ్ళకు పంపించండి  నాకు వాళ్ళ నెంబరు లేదు

రాజ్యాంగ నిర్మాతా

Image
 భారత రాజ్యాంగ నిర్మాతా         బాబా అంబేధ్కరుడా  అందుకో నా వందనాలు పాదాభి శిరసాది అభినందనలు 🙏 నా తల రాతను తిరగరాసిన నా ప్రియమైన దైవమా, నెత్తిన ఉన్న మట్టి తట్ట తీసి, అక్షరాల బుట్టను తలకెక్కించి ,  డిగ్రీల టోపీలు ధరింపచేసి, నేలచూపులు మాని నీలాకాశం వైపు చూడగలిగే దైర్యాన్ని ఇచ్చిన వేగుచుక్కా  వీర సైనాధిపతి రెడ్‌సెల్యూట్‌లు                 నీవిచ్చిన స్వేచ్ఛ తో ఈ 70 వ ఏటి వరకూ నన్ను నే రక్షించుకుంటూ నా జాతీయులకు నా పరిదిలో సాయపడుతూ గడప గలిగాను నీ రూపం మనస్సున నిలుపుకొని..............                🌺 నిత్య నవ రాజ్యాంగ నిర్మాతా అంభేధ్కర్‌మహోదయా నీకివే నా నివాళులు 🌹♥️🌹 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

శివ సన్యాసి

 (సదా శివ సన్యాసి తాపసీ కైలాసవాసి………..).                                   హలో అయ్యా అభిలాషి తాపసీ           శ్రేయోభిలాషీ                                          మీ అందరి దీవెనతోనే అయ్యాడు అబ్బాయి అయ్యాడిప్పటికి అమెరికా వాసి                                       సతీసమేతంగ  సంతతి తో పాటుగా అయ్యాడు  అమెరికా వాసి                                         సమయం పదేళ్ళు పట్టినా మనసానందనందమాయెగా.         ఆ సంతోషం పంచే తీరున                  ఇది పంపా అందరి ఎరుకకు        ...

జలపాతం

Image
 దూరంగా ఉన్న పెద్ద జలపాతాలకు వెళ్ళలేని పేదవాళ్ళకోసంరాష్ట్ర టూరిజం 50% డిస్కౌంతో                            కుత్రిమంగా  ఏర్పాటు చేశారీ కుత్రిమంగా  ఏర్పాటు చేశారీ  https://youtube.com/shorts/8xR72xUTS4A?feature=share ఆరోగ్యకరమైన” మడ్‌” జలపాతం                ఇందులో స్నానమాడినవారికి. @మడ్‌తెరఫీ@  గానీ మరోజన్మ గానీ ఉచితం.                                      .         మునగండీ తేలండీ తేలండి  అటైనా          ఇటైనా        ఎటైనా                          🙏శుభోదయం 🙏  ❤️❤️❤️🤥❤️🤥❤️🤥❤️❤️

covid

 మూడేళ్ళ నాటి శనిని నేటితో శివశివా అంటూ అంతరించి అంతర్ధానమైయిందని  “ఆశల”పల్లకిలో అదిగో అదిగదిగో  వచ్చేసింది “శుభకృత్‌” “వికారి “ అదో భయంకారి  భూగోళానంత చేసింది “బికారి “ లా భీభత్స వినాశకారి ఎందరినో చేసింది   మృత్యుబారి .  చెలరేగింది మానవ దేహాల కైంకర్యదారి  “శార్వరి” వచ్చింది నల్లశార్దూలిలా  పేరే చీకటి కనిపించని కాళరాత్రిలా  కాటిలో కళేభరాల గుట్టలు వేసింది  ప్రముఖులెందరినో కాల్చుకుతింది  మనిషి కాలం సైతం తన కాలు క్రింద కసి తీరా నలిపి నలిపి వదిలింది  “ప్లవ”  అంటే “ప్లవరనుకున్నావా”  తెలుగు లో “పుష్పా” అన్నా  అటునుంచీ “తగ్గేదేలేదు” అని తనవంతుగా ఎంతోకొంత హరించింది మన భయాల్ని వాడుకుని వాడుకగా  ప్రతి ఇంటి లో చేరి దాగిదాగి “సహజీవనం” మొదలు పెట్టింది  “ప్లవ” నామ మహిమో , మానవ విజ్ఞాన శాష్త్ర వికాసమో  కమ్మిన కారుమబ్బులు  కాలగర్బాన కలిసే రోజు తో  “ శుభక్రిత్‌” నామ తెలుగు సంవత్సరం కాలూనింది  గత మృత వేధనలకు “శుభం కార్డు” వేస్తుందని ॥ఆత్యాస॥ పడుతూ ……… అందరికీ శుభం కలగాలి  మునుపటి మంచిరోజులు ...

కోయిల గోల

Image
 కోయిల గోల ఈమధ్య ఓ కోయిలమ్మ రాత్రనకా, పగలనకా తెగకూసేస్తుంది గమనించారా? సారీ కూయటం కాదు “అరుస్తుంది “  అవునండీ ఓ సమయం సంధర్బం లేకుండా గొంతెండి పోయేలా “అరుస్తూనే” ఉంది  దాని పాటలో “కమ్మదనం”పోయింది  బొంగురుపోయిన గాత్రం గాడిద ను మరిపిస్తున్నది కవితలో కవ్వింపులే కనబడుతున్నాయి తినగ తినగ “వేము”తియ్యనుండేమో గాని  వినగ వినగ దాని “రాగం” వెగటు గుండె గుండెలవసేలా “అరుస్తుంది” దాని గోలకి కాకులు కూడా “కామ్‌” అయిపోయాయి కాకి గోలలు లేవు దాని గోలే వినిపిస్తూంది  వాకబ్‌ చేశా ।! అవి ఆకలి కేకలు కావు  తోడుకోసం వేసే కవ్వింపు హేళ అరుపులు పాపం వంటరై దిక్కు తోచక దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంది వండింది తినే “నాధుడు”కరువై చేస్తున్న విరహ గానాలవి. ఇది ,మరో ప్రపంచంలో స్వేచ్ఛాపవనాల లోవిహరిస్తున్న పచ్చిరెక్కల  ముక్కుపచ్చలారని కూన కోకిల ట్విట్టర్‌లోను, ఇన్‌ష్టాగ్రాముల్లోను, చివరికి ఫేసుబుక్కుల్లోదూరి నడిసంద్రాన ఎవరైనా దొరుకుతారేమోనని వెదుక్కుంటుంది  తన “నల్ల”ని అందం చూసి ఎవరొస్తారు  ఆ ! నల్లనైతేనేమి ఎర్రని నిప్పుల్లాంటి కళ్ళు ,ముక్కు , కారునలుపులో కళగానే ఉంటుందిగా!...

ఫోటో FACE

😎😎😎ఫోటో FACE 🤠🤠🤠 ఫోటోలు ఒకప్పుడు ఫేముల్లో తరువాత ఆల్‌బమ్‌ పుస్తకాల్లో ఇప్పుడు  “సెల్‌” పోనుల్లో  రేపు  ?????? ????? ప్రేముల్లో గోడల మీద ఎప్పుడూ అందరి కళ్ళ ముందే కనిపిస్తూ ఉండేవండీ  వాటిని పుస్తకాల్లో చేర్చి , మనస్సుకీ , మస్తకానికీ దూరం చేశాము మనకి మరీ పనిలేకపోతే తప్ప అవి కనిపించటం మానేశాయి  మరిప్పుడా  సెల్‌పోనుల్లో….. “సెల్‌” లో “చెర” లో బందీలై మరుచటి నాడే   మరుగై మాసిపోతున్నాయి  రోజు రోజుకీ వందల్లో చేరే వరదనీటిలో ఒంటరి ఓల్డు బొట్టులా @గ్యాలక్షీ @నడి సంద్రాన మునిగిపోతున్నాయి ఏడాదికో అందులో అరకో అప్పుడప్పుడూ  @గూగుల్‌ పోటోస్‌@ పుణ్యమా అని   ఎడారి ఇసుకలో ఏరి కొన్ని అందిస్తే తప్ప , మన మెదడు “మెమరీ” కార్డుల్లో బ్లింకు కావు  ఆ సింకైన పాత పోటోలు “గ్యాలరీ” లోకి…………. ఇదే అదును ఒకటికాదు, రెండుకాదు, మూడు, నాలుగు కెమారాలు కూర్చి అధిక లాభాలు గుంజుకుంటున్నాయి సె… [8:33 PM, 9/5/2022] Raja: శ్రీ సాయిరామా,”రమా” నామేసు ధ్వయ “స్వయ ఆలోచన” సఫల సమయమాసన్నమైన సుముహూర్తవేళ.. రమ “ప్రియసఖులు “( మిత్రబ్ృందం  సందడి సందడితో పెళ్ళిపందిరి ...

వసంతాల

Image
  @44@ వసంతాల సంసార సంత జీవితం పరిపూర్తి నేడు.అంతా ఆత్మాభినందనల ఆభిమానాల ఖర్చు తో ఆనందంగా జీవిస్తూ …             ముందు ముందు మీ ఆదరణాశిస్సులు కోరుకుంటూ …….                                               మీ                                                                      ముత్యాల కమల వెంకటేశ్వర రావు 🙏🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

ఉషోదయాన

 ఉషోదయాన ఊసుపోక బాల్కనీ    ఊయలలో ఊగుతూఉన్నానా !  నక్కినక్కి నాకెదురుగా వచ్చాడండి   చిలిపి బాల భానుడు 🤡🤡😘🥲  వచ్చీరాగానే వేయసాగాడు తైలవర్ణ చిత్ర ధ్రుష్య కావ్యాలు  🌹❤️🌹   కావాలనే కవ్విస్తున్నాడు  కారుమబ్బుల్ని పంపి కప్పేద్దామనుకున్నా ☝️  క్షణంలో వాటిని ఏమార్చి  కారునలుపు మార్చి కన్నుకొడుతున్నాడు  వాటి వెనకే దాగి దాగి🌘🌒  నేనూరుకుంటానా  చేశా వాడి చిలిపి చేష్టల రికార్డ్ నా ఆపిల్‌పోనుని దాచి దాచి 🏹  పిదప సాక్ష్యం చూపాలిగా మీకు “బాలుడ్ని ఆడిపోసుకుంటున్నా అనుకుంటారేమోనని😡😡….  ముత్యాల 🤡🤡

అంబా

 “అంబా”అనటం తప్ప అసలు విషయం తెలియని ఆవు ప్లాస్టిక్ పలహారం           “ఫల”హారం గావించి, అరగక అన్నపానాలు మాని ఆపసోపాల పాలైయింది                               అన్నీ తెలుసనుకునే మనం ఆ పాపాన్ని సృష్టించి మన సౌలబ్యంకోసం సౌకర్యం గా క్యారీబ్యాగుల్లో అది ఇది కాదు అని “అన్నీ” అరిగించుకోనంత ఆహా,ఓహో, అబ్బా,జభా అంటూ అన్నీ కానిచ్చి కాళీచేసిన వాటితో అవని ఆకాశం తాకేలా చేసి **అమ్మో బాబో * ఓ యం జీ, : జీ వీ యం జీ అంటూ                          “”హేడ్సు బర్న బర్నాల్ అపై”” లా అన్న చందాన ఉందే 🤭🤫.                                       ఐనా మొదలైన ఈ యజ్ఞం ఏ గాలీవాన ల బారిన పడకుండా ఆరిపోకుండా మన ప్లాస్టిక్‌ ఆహుతి చేద్దామా!! 

మన్యం దొర

Image
మన్యం దొర మన “అల్లూరి”  తెల్లవాడి మర పిరంగులకు, తుపాకీ తూటాలకు, ఎదురుగా అడవి బిడ్డల “చరా” లకు తన యుద్దతంత్రాలను జోడించి వాడి గుండెలదర యధపై గండ్రగొడ్డళ్ళ నూరిన మహా సేనాని .  “విల్లు ఎక్కపెట్టి నారి సారించి చరాలవానలు కురిపించి వాడి  “నరాల నార” తీసిన అరివీరభయంకరుడు  అభినవ అర్జునుడు  అడవి తల్లి బిడ్డలు గండు చీమల దండు తో తెల్లవాడి కండలూడ పెరికించిన యద్దనీతి ప్రజ్ఞుడు అపరశానిక్యడు శ్రీ సీతారామ రాజు  బ్రిటీష్‌ గుండెలు బీట్లు కావించి , కంట్లో కాలే నలుసై స్వతంత్ర పోరుకు సాయుధ భాట చూపిన తొలి దేశభక్తీసారధి తెలుగు నేల కన్నబిడ్డ “అల్లూరి”  ఆడ బిడ్డల మానం ప్రాణాలు  కాపాడే క్రమంలో క్రమశిక్షణ గల సైనికుడిలా గగనానికేగిన *క్రాంతి కపోతం**  భారత మాత బానిస సంకెళ్లు తెగనరికే మహా యజ్ఞం లో సమిద అయిన ఎర్రని కణం ఇంకా కణకణ లాడుతూ నూరేళ్ళు బ్రతికిఉన్న “అమరజీవి ఆమరణదివ్వె “  మన తెలుగు వారి కాగడా దివ్వె అల్లూరి   ముకుళ్ళిత హస్తాలతో గుండెనిండా గర్వం నింపుకు చేద్దాం నినదిధామ్  జోహార్‌ అల్లూరి  జోహార్లు జోహార్లు  ❤️🌹❤️💐💐💐💐💐💐

జాము రాతిరి జాబిలమ్మ..

Image
  జాము రాతిరి జాబిలమ్మ….. చందమామ తన ముఖ అందాన్ని సాగరంలో చూసుకుంటూ మురిసిపోతున్న వేళ  నగర జనం సగం పైనే ఆ సముద్రపు అలల లా  బీచ్‌ అంచుల్లో పోటీ పడి మరీ “పోటెక్కి” పోతున్న వేళ   సన సన్నని చిరుగాలి ప్రతి చెక్కిలి ముద్దాడతూ తన్మయపరుస్తున్న వేళ   చిరు జల్లుల జడి వాన మేనునంతా తడిమి చెక్కిలిగింతలు పేడుతున్న వేళ   ఐనా ఈ నిప్పుల కుంపటి చిరిగిన చత్రం కింద విసన విసుర్లకు చెలరేగి ఎగిరెగిపడుతూ జొన్నపొత్తుల్ని ఒడిసిపట్టి ఓలలాడిస్తున్న వేళ   పిడత క్రింద పప్పు చిందే పొగ వాసన మస్తికం చేరి నాసికం ద్రవం ఊరి దరి చేరే వేళ   విశాఖ బీచ్‌ పేమస్‌  “ మురీ మిక్సీ” బండి చుట్టూ  దండులు దండులు గా దండెత్తి ముట్టడించి నోరారా ఆరగించి ఆ రుచిని ఆస్వాదించి అంత కారంలోనూ మమకారం పెరిగి “ఒన్‌ మోర్‌ ప్లీజ్ “ అని   “ ఆహా ఏమి రుచి తినరా మైమరచి “ అని  కారం ఘాటుని నిమ్మ నీరు కొంత  నిమ్మది పరుస్తున్న వేళ   “చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు “అంటూ “కారు”మేఘాల చాటున నక్కినయ్యను కరెంటు దీపాల వెలుగు లో వెదుకుంటూ ………. తమ తమ కారు వాహనాల్ని...

ఏమిటీ వైపరీత్యం

 ఏమిటీ వైపరీత్యం 🤔.       నీలి సముద్రం ఎలా నల్ల సముద్రాన్ని తలపిస్తూందో  తాపం తాళలేక తీరం దాటే యత్నం లో తెల్లని నురగలు కక్కేసుంది. 🤔 మన భవన సముదాయం మొత్తం వేడికి తాళలేక “తెల్లబారి”పోయింది 🤔 పచ్చని వృక్ష సంపద చావుకి దగ్గరౌతున్నామా అనే బెంగతో వేళ్ళాడిపోతున్నాయి 🤫🫢 ఆ నిర్మాణంలో ఉన్న నూతన కట్టడం కదిలి పోకుండా  “కర్ర కట్లు “వేసుకుంది  🤭🫣 వేసవి కాలం ,వర్షాకాలం ,చలికాలం కాదు గుర్తుంచుకోండి           ఇది “”కలికాలం”” 🥵👹 అంచేత అందరూ అడుగు బయట పెట్టేముందు  “అర”సారైనా ఆలోచించండి  పైన నెత్తిన బొచ్చున్నా, లేకున్నా , పెట్టండి మీకు మీరే ఒక టోపీ 🤗🤗 ఆడ లేడీసైతే తీయండి మీ చేతి బ్యాగులో “ చత్రం “ 🫡🫡 “చెక్‌ “పెడదాము ఆ సూర్య ప్రతాపానికి ..🤠🫶 సాగిద్ధాం జీవన నౌకలు ఆ అగుపించే మర ఓడల్లా😜🤪 మీ ముత్యాల 🤡🤡

ఈ ప్రపంచమెంత సుందరమైనది !

 ఈ ప్రపంచమెంత సుందరమైనది !  🎄🌈🌻సప్తవర్ణాలు మేనినిండా పులుముకుని కనుల విందుగా.  సప్త స్వరాల సహజ సంగీత భరితమై , కర్ణానందమై.  💦🌈🪸సప్త సంద్రాల హోరు తో , సర్వ నదుల వయ్యారపు ఒంపుసొంపులతో మదిలో ఆనంద భరిత అస్వాదనతో పులకించకపోవ !!  🐓🦚🕊🐃🐂పశు పక్ష్యాదుల ప్రాతహ్‌కాల ప్రాక్రుతి పరమైన మేలుకొలుపులతో.  🌲🌧⛈🌈⚡️💥అడవి తల్లుల ఆసరా తో కురిచే కారుమేఘాల ఉరుములు మెరుపుల ఆడంబరాలతో, అప్పుడప్పుడూ పిడుగై ఆద్దిరిచే నాన్నలా!! ☃️⛄️అక్కున చేర్చుకుని ఏమార్చే పెద్దక్కలా,పెద్దన్నలా॥ 🧘🏼🧘🏿‍♀️తన చరిత్రను టీవీ సీరియల్‌ ల్లా సాగదీసి చెప్పే అమ్మమ్మ లా . అబ్బా ఈ ప్రకృతి ఎంత అందమైనది. …………।।॥।।. మీ ముత్యాల 🤡

ఆహ్వానం [for Oceana]

Image
  💐  ఆహ్వానం 💐                      ఓం గణాధిపతిగా మాధళపతీ  వినాయకా! స్వస్తిశ్యీ చాంద్రమాస శ్రీశుభకృత్ నామసంవత్సర శుధచవితి  ది॥31-8-2022 రోజున .. మూషిక వాహడవై నీ  మందీ మార్బలం తో  దండెత్తి  రా రావయ్యా  వినాయకా మహానాయకా🙏🙏  తాళమేళాల స్తుతి దండకాల తో ఉండ్రాళ్ళతో ఫల పూల తో  ధూప ధ్వీప నేతి నైవేధ్యాల ,పప్పు బెల్లాల తో , వడ పాయసాలతో స్వాగతిస్తూ ఎదురు చూస్తున్నాము   మా ఉండ్రాళ్ళ “గుండ్లు”వర్షాన  భక్తిగానాల కీర్తించగా నీ లంభోదరం నిండగా   మా పూజలంది,  మంగళవాధ్యాలు , వేదమంత్రాల గొంతులు మారుమ్రోగంగా ,  నీ తొండము ,ఏకదంత ద్వయము నేయికారుచుండ,  నీ మూషికము  కొబ్బరి చిప్ప నములుచుండ, ఇంక ఏది నీకేది మరోదారి ….మమ్ములను ఆశీర్వదించకుండా …  నీ చిన్నని “కరి”కళ్ళ  చల్లని చూపులు ,నీ తొండము  మా శిరస్సుల తాకి మేను  పరవసించిన వేళ   ఉండగలమా చిందులేయకుండా!  ఎవ్వరాపగలరు మాభక్తగణాన్ని  ఆ ఆనందాల వరదలో కొట్టుకుపోకుండా !!  ...

స్వర్గానికి దారి .... వయా నరకధ్వారం

 👺🧌స్వర్గానికి దారి               వయా నరకధ్వారం 🧌👹.    సడన్‌ గా ఏదోపెద్ద శబ్దం మాంచి నిద్రలో ఉన్నా, మెలుకువ వచ్చి కళ్ళుతెరిచా ,కోపంగా @ఎవడ్రా అది అని కోపంగా …అరవాలనుకున్నా …  కానీ కానీ ..  కారునలుపు తారుడబ్బాల్లా ఇద్దరు కత్తులు బుజాన్నవేసుకుని మంచానికి చెరోపక్కనిలబడిఉన్నారు .    నోరు పెగల్లేదు. గొంతు           తడారి పోయింది క్షణంలో తెరుచుకున్న నోరు మూసేలోగా … 👺“పద పద పద నీ కలలవల్ల ఇప్పటికే లేటైపోయింది”   అంటూనే చేరో భుజం పట్టుకుని లేపేశారు ,మంచంమీదనుంచీ 🤠ఏయ్ ఎవరుమీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు “ భయంగానే గొణిగా … 👺ఒరే బచ్ఛా ఇన్ని సినిమాలు చూస్తున్నావు మమ్మల్ని ఇంకా గుర్తుపట్టలేదారా ?  మీరు మమ్మల్ని ఇలా సినిమాల్లో చూపిస్తున్నారని  మా స్వంత  “డ్రస్‌కోడ్‌”వదలి  మీ సినిమాల్లోలాగా@అర్ధనగ్నంగా ,  అందవికారంగా తయ్యారై వస్తే గుర్తుపట్టవారా ? 👹అని  పళ్ళు పటపటా కొరికి , నెత్తిమీద మెత్తగా మొత్తాడు ఒకడు . 👺ఈ డ్రస్సుతో డ్యూటీదిగి ఇంటికి వెళ్తే మా ఆడాళ...